34.2 C
Hyderabad
Monday, May 29, 2023

కరోనా కొత్త వేరియంట్‌పై కేంద్రం అప్రమత్తం

  • ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
  • జినోమ్‌ సీక్వెన్సింగ్ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు

కోవిడ్ మళ్లీ భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటినుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కోవిడ్ ను నియంత్రించవచ్చని అంటున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు. మరోవైపు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజా పరిస్ధితులపై ప్రధాని మోదీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త వేరియంట్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచాలని ప్రధాని మోదీ అన్నారు. కరోనా కేసుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఆసుపత్రుల్లో పడకలు, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అవసరమైన మందులు, ధరలపై పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

చైనా, దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలను తీసుకుంటున్న కారణంగా తీవ్ర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ప్రమాదం పొంచి ఉందంటున్నారు.

చైనా లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత.. కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ చైనా నిబంధనలను కఠినతరం చేస్తోంది. చైనా, అమెరికా, దక్షిణ కొరియాల్లోని పరిస్థితులను కేంద్రప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వారానికి దాదాపు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా.. దేశంలో వారానికి 1200 కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ఈ క్రమంలో కోవిడ్ ఫోర్త్ వేరియంట్ కు సంబంధించి కోవిడ్ కేసులను జినోమ్‌ సీక్వెన్సింగ్ చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే రెండేళ్ల నాటి పరిస్థితులు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించారు.

Latest Articles

తుపాకీతో కాల్చేస్తా మాజీ మంత్రి చిన్నారెడ్డి వార్నింగ్

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో అధికారులు రహదారి విస్తరణ చేపట్టారు. విస్తరణలో భాగంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్