- ములుగు జిల్లా అలుబకలో తెలంగాణ డీజీపీ పర్యటన
- మావోయిస్టుల నియంత్రణకు చర్యపై సమాలోచనలు
- పాల్గొన్న ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఇంటెలిజెన్స్ ఐజీ

ములుగు జిల్లా అలుబకలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ –ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల కదలికల నియంత్రణకు… పోలీసు ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ఈ భేటీలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణలో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తోందన్న సమాచారం అందడంతో.. పోలీస్ బాస్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని, ఆ దిశగా ఆపరేషన్స్ కొనసాగిస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా.. మావోయిస్టులందరూ లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.
