25.7 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

ప్రేమించి పెళ్లి చేసుకుంటే…పొడిచేస్తారా?

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఎన్నో సంఘటనల తర్వాత పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయ్యిందేదో అయ్యిందని పెళ్లి కూతురి తరఫు వాళ్లు ఊరుకోలేదు. మా అమ్మాయికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని భావించి…అల్లుడని కూడా చూడకుండా కత్తులతో దాడి చేశారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళితే… కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఈ దారుణం జరిగింది. అల్లుడి పేరు మాల వీరేశ్, తను తన ఊరిలో అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇది ఆ అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులకు నచ్చలేదు. నయానా భయానా చెప్పి చూశారు, వినలేదు. ఈ సమయంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకునేసరికి వారి కోపం తారాస్థాయికి చేరి అల్లుడిని పొడిచేవరకు వెళ్లింది.

హత్యాయత్నం చేసిన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపించారు

Latest Articles

మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్