27.7 C
Hyderabad
Monday, May 29, 2023

హోరాహోరీ పోరులో గెలిచిన అర్జెంటీనా

ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్ పోటీల్లో హోరాహోరీగా పోరాడి అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. మొదట్లో తడబడినా చివర్లో పుంజుకుని గట్టిగా పోరాడిన ఫ్రాన్స్ రన్నరప్ గా నిలిచింది. చివరి వరకు నువ్వా-నేనా అన్నట్టు సాగిన మ్యాచ్ లో రెండు జట్లు చెరో మూడు గోల్స్ సాధించి సమఉజ్జీగా నిలిచాయి. దీంతో పరిస్థితి షూటవుట్ కి వెళ్లడంతో అర్జెంటీనా నాలుగింటికి నాలుగు గోల్స్ చేస్తే, ఫ్రాన్స్ తడబడి రెండు మాత్రమే చేసింది. దీంతో ఫైనల్ కప్ అర్జెంటీనా ఎగరేసుకుపోయిందిఫ్రాన్స్ రన్నరప్ గా నిలిచింది.

నిజానికి ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమయ్యాక అర్జెంటీనా ధాటికి ఫ్రాన్స్ నిలవలేకపోయింది. వాళ్లు మందకొడిగా మ్యాచ్ ను ప్రారంభించారు. కనీసం ఒక అటాక్ కూడా చేయలేకపోయారు. ఈ క్రమంలో 70 నిమిషాల వరకు అర్జెంటీనాదే పై చేయిగా నిలిచింది. 23వ నిమిషంలో పెనాల్టీ రావడంతో మిస్సి వెళ్లి గోల్ కొట్టి అభిమానుల్లో ఆనందం నింపాడు.

మరో 13 నిమిషాల ఆట నడిచింది. 36వ నిమిషంలో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని మిస్సి సహాయంతో సహచరుడు గోల్ కింద మార్చేశాడు. అప్పటికి అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలో ఉంది.

ఫస్ట్ హాఫ్ లో అర్జెంటీనా సంతోషంగా విశ్రాంతికి వెళ్లింది. తర్వాత వచ్చాకే అసలు డ్రామా మొదలైంది. 79వ నిమిషం వచ్చింది. అప్పుడే కథంతా మారిపోయింది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపే ఒక్కసారి సీన్ అంతా మార్చేశాడు. చకచకా 90 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ చేసేశాడు. అందరిలో ఉత్కంఠ. స్కోర్లు సమం అయిపోయాయి.

ఈ సమయంలో అర్జెంటీనా ఆటగాడు మిస్సీ సమయస్ఫూర్తితో మరో గోల్ చేశాడు. మళ్లీ 3-2 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట ఇంకా 12 నిమిషాలు మాత్రమే మిగిలింది. అర్జెంటీనా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపే ఊరుకోలేదు. పెనాల్టీ షూటౌట్ ని గోల్ గా మార్చేశాడు.  మళ్లీ 3-3 తో స్కోర్లు సమం అయ్యాయి.

అత్యంత ఉత్కంఠగా మారిన మ్యాచ్ చివరికి సమయం అయిపోవడంతో షూటౌట్ వరకు వెళ్లింది. అక్కడ అర్జెంటీనా నాలుగింటికి నాలుగు గోల్స్ చేయగా, ఫ్రాన్స్ రెండు మాత్రమే చేసి విజయం చేరువలోకి వచ్చి పరాజయం పాలైంది. మూడున్నర దశాబ్ధాల తర్వాత మళ్లీ ప్రపంచకప్ గెలుచుకున్న ఆనందోత్సాహాల మధ్య అర్జెంటీనా ఉంటే, పోరాడి ఓడిన జట్టుగా ఫ్రాన్స్ మిగిలిపోయింది.

మూడు గోల్స్ చేసిన సూపర్ స్టార్ మెస్సీ ఈ వరల్డ్ కప్ తర్వాత రిటైర్ కాబోతున్నాడు. చివరికి ప్రపంచకప్ అందించిన హీరోగా చరిత్ర సృష్టించాడు. క్రికెట్లో మన సచిన్ తన చివరి వరల్డ్ కప్ లో ఆడి ట్రోఫీని ముద్దాడి ఎలా రిటైర్మెంట్ ప్రకటించాడో మిస్సీ అలాగే చేయడం విశేషం.

ఇక్కడ రెండు ముఖ్యమైన విశేషాలున్నాయి. అదేమిటంటే వరల్డ్ కప్ ఫుట్ బాల్ ఫైనల్ ట్రోఫీని బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఆవిష్కరించింది. లుసైల్ స్టేడియంలో స్పెయిన్ దిగ్గజ గోల్ కీపర్ ఇకర్ కాసిలాక్ తో కలిసి ట్రోఫీని తీసుకువెళ్లి మైదానంలో పెట్టారు.

ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ ఫైనల్ మ్యాచ్ చరిత్రలో గుర్తుండిపోతుంది. విజేత అర్జెంటీనాకు అభినందనలు. ట్రోఫీ ఆసాంతం జట్టు గొప్పగా ఆడింది. భారత్ లో కోట్ల మంది మెస్సీ, అర్జెంటీనా జట్టు ఆటను ఆస్వాదించారని తెలిపారు. ఫ్రాన్స్ కూడా బాగా ఆడిందని మోదీ ట్వీట్ చేశారు.

Latest Articles

నేటి 12 రాశుల శుభ, అశుభ ఫలితాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: జ్యోతిష్య నిపుణులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశిఫలాలు చెబుతుంటారు. అనేక విషయాలను ప్రామాణికంగా తీసుకొని మే 29, సోమవారం నాటి రాశిఫలాలను అంచనా వేశారు. జ్యోతిష్యం ప్రకారం,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్