- అరుదైన గౌరవాన్ని అందుకున్నభారతీయ నటి
- వరల్డ్‌కప్‌ను స్వయంగా ప్రదర్శించిన’స్వతంత్ర’ ప్రతినిధి జాఫర్‌అలీ
కతార్: ఫిఫా-2022 వరల్డ్ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ట్రోఫీని భారతీయ నటి దీపికా పడుకొనే ఆవిష్కరించారు. ప్రపంచకప్ ఫైనల్స్ పోటీ ఆరంభానికి ముందు కప్ ఆవిష్కరణలో దీపిక పాల్గొన్నారు. ఫుట్ బాల్ ప్రపంచకప్ ఆవిష్కరించే అరుదైన గౌరవం భారతీయ నటికి లభించడం విశేషం. ఆవిష్కరణ అనంతరం మరో వ్యక్తితో కలిసి కప్ ను ప్రత్యేక వేదిక పై ఏర్పాటు చేశారు. ఫైనల్స్ అనంతరం స్వతంత్ర ప్రతినిధి జాఫర్ అలీ ప్రపంచకప్ ను ప్రదర్శిస్తూ.. అర్జెంటీనా వరల్డ్ ఛాంపియన్ అని ప్రకటించడం హైలైట్‌గా నిలిచింది.