- బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడి గా ఎన్నిక
- సోమవారం ప్రమాణ స్వీకారం
- హాజరు కానున్న మోదీ, అమిత్ షా
గుజరాత్ ముఖ్యమంత్రిగా మళ్లీ భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. గుజరాత్ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు. భూపేంద్ర పటేల్ ఎన్నికను బీజేపీ ఎమ్మెల్యే హర్ష సాంఘ్వీ గాంధీనగర్ లో ప్రకటించారు.

గుజరాత్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుకల్పిస్తూ, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన కేబినెట్ సభ్యులు శుక్రవారం గవర్నరుకు తమ రాజీనామాలు సమర్పించారు.సోమవారం భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరవుతారు. భూపేంద్ర పటేల్ 2021 సెప్టెంబరులో గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు.