ప్రధాని మోడీ పర్యటన ఇలా
ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు ప్రధాని మోడీ. 1.35కి విమానాశ్రయం నుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్ నగర్ కు వెళ్తారు. మధ్యాహ్నం 2.05 గంటలకు పాలమూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.15-2.50 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగసభలో పాల్గొంటారు ప్రధాని మోడీ. అనంతరం హెలికాప్టర్‌లో సాయంత్రం 4.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడ్నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
మరోసారి కేసీఆర్ గైర్హాజరు
కాగా, మరోవైపు, ఆదివారంనాటి ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ మరోసారి దూరంగా ఉండనున్నారు. ఆయనకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఇంకా కోలుకోకపోవడంతో తెలంగాణ మంత్రివర్గ సమావేశం కూడా వాయిదా పడింది.