స్వతంత్ర వెబ్ డెస్క్: గత రెండు రోజులు నుంచి లాభాల్లో సాగుతున్న స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10:20గంటల సమయంలో సెన్సెక్స్ 251 పాయింట్ల నష్టంతో 62,718 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 18,560 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆరు పైసలు కుంగి 82.73 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, టైటన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అప్పుల పరిమితి పెంపు బిల్లు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఓటింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మార్కెట్లలో అప్రమత్తత కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి.