వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియా.. నేడు రాజ్‌కోట్‌లో జరిగే మూడో టీ20లో ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. బౌలర్ల జోరు అభిషేక్ శర్మ అదిరే బ్యాటింగ్‌తో తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. తిలక్ వర్మ అద్భుత పోరాటంతో రెండో మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయాన్నందుకున్నందుకుంది. ఇప్పుడు రాజ్‌కోట్‌లోనూ నెగ్గి, రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనుకుంటోంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడినా.. ఇంగ్లాండ్ బలమైన జట్టే. పుంజుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. రాజ్‌కోట్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్లకు సహకారిస్తోందని సమాచారం.