తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. మాటల గారడీతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంద న్నారు. హామీలు అమలు చేయకుండా రాహుల్ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నిం చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బగా హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో కిషన్ రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలిచి మరోసారి ప్రధానిగా మోదీ గద్దె ఎక్కుతా రని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


