స్వతంత్ర, వెబ్ డెస్క్: నీళ్లు, నిధులు, నియామకాలపై అనేక సంవత్సరాలు కొట్లాడి.. అనేక మంది త్యాగవీరుల ఫలితంగా 2014 జూన్ రెండో తేదీన 29వ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. తొమ్మిది వత్సరాలు పూర్తిచేసుకొని పదో ఏట అడుగుపెట్టింది. ఈ తొమ్మిదేళ్లలో అపార అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతున్న తెలంగాణ నేడు పదేళ్ల పండుగ చేసుకుంటోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయం మేరకు.. 3 వారాలపాటు తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్ణహించనున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన నేడు.. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు వేడుకలలో పాల్గొని జెెెెెెెండా ఆవిష్కరించి దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజులు జరిగే దశాబ్ది ఉత్సవాల్లో ఒక్కోరోజు ఒక్కోరంగానికి సంభందించి తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. చివరిరోజైన 22వ తేదీన అమరవీరులకు ఘన నివాళి అర్పించే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.