తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టీ.రామరావు 101వ జయంతి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి శ్రద్ధాంజలి ఘటి స్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మనవళ్లు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటిం చారు. పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తమ తాతతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. అనంరతం నందమూరి బాలకృష్ణ, పురందేశ్వరి దంపతులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిం చారు.ఎన్టీఆర్ ఓ శక్తి అని అన్నారు నందమూరి బాలకృష్ణ. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. నందమూరి తారకరామరావు 101 జయంతి సందర్భం ఆయనకు నివాళులు అర్పించారు.
మరోవైపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. ఆ మహనీయుడి 101వ జయంతి సంద ర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందాం అని అన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవు ళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్…తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని చెప్పారు. తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం…ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం అని చంద్రబాబు ట్వీట్ చేశారు.