వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షుడు జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరిం చాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపై జగన్ చర్చించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోయడం తదితర అంశాలన్నీ కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. నిన్ననే పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులతో జగన్ సమావేశమై వివిధ అంశాలపై వారితో చర్చించారు.. వారికి దిశానిర్దేశం చేశారు.