పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఎర్రవల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జన జాతర సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. హెలికాప్టర్లో సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు 10వ బెటాలియన్ చేరుకుని ..అక్కడి నుంచి సభ ప్రాంగణానికి 3 గంటల 45 నిమిషాలకు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు.. సభను విజయవంతం చేసేందుకు ఏఐసీసీ కార్యదర్శి, అల్లంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్ నియోజక వర్గాల నుంచి పార్టీ శ్రేణులను తరలిస్తున్నారు. సభ సందర్భంగా ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు వీధుల్లో ఉన్న పోలీసు ఉద్యోగులు సంయమనం పాటించాలని డిఐజి ఎల్ ఎస్ చౌహన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సభ స్థలాన్ని, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు 10వ బెటాలియన్లోని హెలి ప్యాడ్ ను జిల్లా ఎస్పీ రీతిరాజ్ తో కలిసి ఆయన పరిశీలించారు.. సభా ప్రాంగణాలు వద్ద ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు..


