వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి మల్ల న్న విజయం సాధించారు. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం బీఆర్ఎస్ మద్దతిచ్చిన రాకేశ్‌రెడ్డి కంటే మల్లన్న 14 వేల 694 ఓట్ల మెజా ర్టీతో మల్లన్న విజయం సాధించారు. అర్ధరాత్రి దాటాక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఆయనకు గెలుపు ధ్రువీక రణ పత్రం అందించారు. గత నాలుగుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన ఈ స్థానంలో తాజాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మూడు రోజులపాటు ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ వరకు మల్లన్నకు రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఎలిమినేషన్ ప్రక్రియలో రాకేశ్‌రెడ్డి, మల్ల న్న కంటే సుమారు 4 వేల వరకు ఎక్కువ ఓట్లు సాధించినా.. అప్పటికే మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు 18 వేల పైచిలుకు ఆధిక్యం దక్కింది. మల్లన్న గెలుపు ఖరారు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అనుచరులు నల్గొండలోని లెక్కింపు కేంద్రం బయట బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు


