పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు దుండగులు. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తు లు.. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం టీడీపీ పార్టీ ఆఫీస్‌కి నిప్పు పెట్టడంతో.. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గమనించి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశాడు. కానీ ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలతో కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఘటనకు కారుకు లు ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తుండగా, వైసీపీ శ్రేణులే చేసి ఉంటారని అనుమాని స్తున్నారు తెలుగు తమ్ముళ్లు.


