ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చంద్రబాబు చెప్పారు. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని, వేంకటేశ్వర స్వామే తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి, తెలుగుజాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు.