పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో దారుణానికి ఒడిగట్టారు దుండగులు. సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు 60 మందిని హతమార్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని.. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని బుర్కినా ఫాసో అధికారులు తెలిపారు. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలు ఏర్పరచుకున్న కొంత మంది జిహాదీలు..ఇతడి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ దేశం… ప్రస్తుతం భయానక పరిస్థితులు ఎదుర్కొంటుంది.