TDP in-charge B.Tech Ravi | మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయటంపై పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి మీడియాతో మ్లాట్లాడారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి చిన్న చేపలు మాత్రమేనని.. పెద్ద చేపలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాయని అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత పోరాటానికి ఈరోజు కొంత న్యాయం జరిగినట్లు అనిపించిందని రవి అన్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు బీటెక్ రవి. వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై టిడిపి శ్రేణులు ఎవరు కూడా రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో ప్రకటన చేయొద్దని అన్నారు. పులివెందులలో టీడీపీ జెండా ఎగిరే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని రవి స్పష్టం చేశారు.


