31.7 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

ఈ నిర్బంధాలు చంద్రబాబును ప్రజ‌ల నుంచి దూరం చేయలేవు- లోకేశ్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్​మెంట్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయణ్ను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఇప్పటికీ టీడీపీ నేతలు, అభిమానులు, నారా, నందమూరి కుటుంబాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా చంద్రబాబు అరెస్టుపై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్​పై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి టీడీపీని దెబ్బకొట్టామ‌ని వైసీపీ అనుకుంటోందని లోకేశ్ అన్నారు. కానీ.. ఈ నిర్బంధాలు ప్రజల నుంచి చంద్రబాబును దూరం చేయలేవని తెలిపారు. తన తండ్రిని అక్రమంగా అరెస్టు చేసి టీడీపీని దెబ్బ కొట్టామని అనుకుంటున్న వైసీపీ నేతలు సైకోలు అని లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ నిర్బంధాలు ప్రజానాయకుడైన చంద్రబాబును ప్రజల నుంచి వేరు చేయలేవని తెలిపారు. ఎప్పటికైనా నిజం గెలిచి తీరుతుందని అన్నారు. మ‌రింత‌ బ‌లంగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల కోసం-రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం ప‌నిచేస్తార‌ని తన తల్లి చెప్పిందంటూ లోకేశ్ ట్వీట్‌ చేశారు. మరోవైపు.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. బాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. వారికి అండగా బాబు ఉంటారని భరోసా కల్పిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్