స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సినీ నటుడు శరత్ బాబు 50 ఏళ్ల పాటు తన నటనతో ప్రేక్షకులను ఆలరించారు. 300కు పైగా సినిమాల్లో నటించిన ఆయనకు కొన్ని సినిమాలు మాత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ముఖ్యంగా సీతాకోకచిలుక, అభినందన, హలోబ్రదర్, సాగరసంగమం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, దాగుడుమూతలు, చెట్టుకింద ప్లీడర్, సిసింద్రీ, ఆపద్భాంధవుడు, ముత్తు, సంసారం ఒక చదరంగం సినిమాలు ఉన్నాయి. శరత్ బాబు చివరిసారిగా నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మళ్లీపెళ్లి’ సినిమాలో నటించారు. బుల్లితెరపైనా అంతరంగాలు, ఎండమావులు తదితర సీరియల్స్ లోనూ ఆయన నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. చివరిసారిగా పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కనిపించారు. భాష ఏదైనా ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
ఇది కూడా చదవండి: బిగ్ బ్రేకింగ్: సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత