స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడినా రామోజీరావుకు చాలా బాగుంటుంది. కానీ, మేము చేసి ఏ మంచి పనిచేసినా రామోజీకి వినపడదు, కనపడదు. గత ప్రభుత్వం ఏం చేసింది.. మేము ఏం చేస్తున్నది ఒక లిస్టు పెట్టుకుని రామోజీ చూడాలని చురకలు అంటించారు. కాగా, మంత్రి కారుమూరి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ప్రజలకు కందిపప్పు కూడా ఇవ్వలేదు. ఆ సంగతి రామోజీకి కనపడుదు, వినపడదు. మా ప్రభుత్వంలో కంది పప్పు ధర రూ.150 మార్కెట్‌లో ఉంటే మేము రూ.80కే సబ్సిడీ ఇచ్చాం. నాలుగేళ్లలో మూడు లక్షల టన్నుల కందిపప్పు అందించాం.
కేంద్రం పుచ్చిపోయిన కందులు ఇస్తామంటే మేము వద్దన్నాం. దానికి బదులుగా శనగలు ఇస్తామని చెప్పింది. అవి కూడా వద్దని, కంది పప్పు మాత్రమే కావాలని అడిగాం. దానికి కేంద్రం కూడా ఓకే చెప్పింది. త్వరలో అవి రాగానే ప్రజలకు పంపిణీ చేస్తాం. చంద్రబాబు అంతటి నయవంచకుడు, దుర్మార్గుడు మరెవరూ లేరు. ఈ మాట ఎన్టీఆర్ అనేకసార్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పేదలు కూడా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. చంద్రబాబు ఎవరో ఒకరి సపోర్టుతో ఎన్నికలకు వెళ్లడం తప్ప సొంతంగా వెళ్లలేరు అని ఎద్దేవా చేశారు.


