Badradri Talambralu| భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటివరకు ఒక లక్ష మందికి పైగా భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు టీఎస్ఆర్టీసీ తలంబ్రాలను హోండెలివరీ చేస్తోందని పేర్కొన్నారు. ఈ ముత్యాల తలంబ్రాలను ఈ రోజు స్వీకరించడం జరిగిందని.. త్వరలో అవి మీ ఇంటికి వస్తాయని తెలిపారు. అలాగే తలంబ్రాల బుకింగ్‌ను ఈ నెల 10 వరకు సంస్థ పొడిగించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. తలంబ్రాలు కావాలనుకునే వారు బుకింగ్ కోసం లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020 ను సంప్రదించాలని తెలిపారు.