30.1 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది.. లోకేశ్ సంచలన ఆరోపణ

స్వతంత్ర వెబ్ డెస్క్: జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేయగా, తాజాగా కుమారుడు నారా లోకేశ్ కూడా ఆందోళన చెందుతూ ఎక్స్ ద్వారా ఆవేదన పంచుకున్నారు. చంద్రబాబు భద్రత నిస్సందేహంగా ప్రమాదంలో పడిందని, ఉద్దేశపూర్వకంగా ఆయనకు హాని తలపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తక్షణ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. జైలు గదిలో దోమలు, కలుషిత నీరు ఉన్నాయని, బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, అలెర్జీలతో ఆయన బాధపడుతున్నారని, సకాలంలో వైద్యసాయం అందడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, అధికార యంత్రాంగం ఏం దాచేందుకు ప్రయత్నిస్తోందని లోకేశ్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే అందుకు వైఎస్ జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్