24.9 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

Rules Ranjann : ‘రూల్స్ రంజన్’ ట్రైలర్ వచ్చేసింది!

ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

‘రూల్స్ రంజన్’ ట్రైలర్‌ను ఈరోజు ఉదయం 11:22 గంటలకు విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. తండ్రి పాత్రధారి గోపరాజు రమణ “ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాలి. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాలి. చెప్పు నాన్న ఏం తాగుతావు?” అని అడగగా.. కథానాయకుడు కిరణ్ అబ్బవరం “బీర్ ఓకే” అని చెప్పే సంభాషణతో ట్రైలర్ ప్రారంభమైంది. “సన్నీ లియోన్ హస్బెండ్ నాకు ఇన్ స్పిరేషన్”, “పెళ్ళయితే మీ పెళ్ళాలకు ప్రెగ్నెన్సీ రావాల్సింది, మీకు వచ్చింది ఏంటి?” వంటి జోక్స్‌తో ట్రైలర్ సాగింది. నాయకానాయికల మధ్య సన్నివేశాలు కూడా హాస్యంతో మెప్పిస్తున్నాయి. కలిసి కాలేజ్‌లో చదువుకున్న వారు చాలాకాలం తరువాత కలవడం, సనా(నేహా)ని మెప్పించడానికి రూల్స్ రంజన్‌లా ఉండే మనో రంజన్ కాస్తా పబ్ రంజన్‌గా మారడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అసలు రూల్స్ రంజన్, పబ్ రంజన్‌గా ఎందుకు మారాడు? మందు వల్ల అతని ప్రేమకి, స్నేహానికి వచ్చిన సమస్య ఏంటి? అతని ప్రేమ ఫలించిందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది ట్రైలర్. అమ్రిష్ గణేష్ పాటలలోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా తన ప్రతిభ కనబరుస్తున్నారు. అలాగే ట్రైలర్‌లో విజువల్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి. పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దులీప్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ గా ఎం. సుధీర్ వ్యవహరిస్తున్నారు.

తారాగణం:

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్

సాంకేతిక బృందం:

రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజ
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
డీఓపీ: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
ఎడిటర్ : వరప్రసాద్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్