స్వతంత్ర వెబ్ డెస్క్: బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Shah) ఈ నెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ జీ కిషన్ రెడ్డి అమిత్ షా పర్యటన గురించి వివరిస్తూ.. భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శించుకుంటారనీ, అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో(Khammam) నిర్వహించే ‘రైతు గోస భాజపా భరోసా’ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు.
వివరాల్లోకెళ్తే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 27న తెలంగాణలో పర్యటిస్తారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి(Kishan Reddy) తెలిపారు. దేశరాజధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం వస్తారని తెలిపారు. భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించే ‘రైతు గోస భాజపా భరోసా’ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు.


