తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిం చారు. తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలమయ్యాయి. వైద్య శాఖలో సమస్యలను పరిష్కరి స్తామని హామీ ఇవ్వడంతో జూని యర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి.
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మె విరమణకు అంగీకరించారు. ఎనిమిది డిమాండ్లలో ఆరింటికి మంత్రి సానుకూలంగా స్పందించారు. తమ సమస్యల పరిష్కారంలో భాగంగా జూనియర్ డాక్టర్లు ఎనిమిది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచగా ఆరు డిమాండ్లకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. గ్రీన్ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా స్టైఫండ్ చెల్లించేలా చర్యలు ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లో కొత్త హాస్టల్ బిల్డింగ్‌ల నిర్మాణా నికి నిదుల కేటాయింపు కాకతీయ మెడికల్ కాలేజీలో సీసీ రోడ్ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు.. సూపర్‌స్పె షాలిటీ ఆర్డర్‌కు వీలైనంత త్వరగా సవరణ కొత్త మెడికల్ కాలేజీలకు బస్సుల సదుపాయం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎస్పీఎఫ్‌తో డాక్టర్లకు రక్షణ వంటి డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి 204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు 121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి 79.50 కోట్లు, కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్లకు 2.75 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.