తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్లక్ష్యంగా గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగిందని అన్నారు. ముందు జాగ్రత్త తీసుకోకుండా డీఎస్పీ గేట్లు తెరిచినట్టు తెలిసిందన్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతే కారణాలు తెలుస్తాయని ఆయన వెల్లడించారు.
పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన టీటీడీ ఈవో శ్యామలా రావు.. క్షతగాత్రుల పరిస్థితిపై వైద్యుల బృందంతో ఈవో ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈఓ.
ఘటనలో ఆరుగురు మృతి చెందారని చెప్పారు. 41 మంది గాయపడ్డారని తెలిపారు. ఘటనకు కారణం ఏంటనేది విచారిస్తున్నామని చెప్పారు.
భక్తుల ఆరోగ్యం పరిస్థితిని స్విమ్స్ సూపరింటెండెంట్ రవికుమార్ వివరించారు. అందరికీ చికిత్స అందిస్తున్నామని.. ముగ్గురు మాత్రం మరో రెండు మూడు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాల్సి ఉంటుందన్నారు.