యుకెఐడిఎఫ్ఎఫ్ రెండో వార్షిక హెల్త్ క్యాంప్ భీమవరంలో ఈ నెల 20న సక్సెస్ ఫుల్‌గా జరిగింది. డిఎన్ఆర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో 3 వేల మంది హాజరై చికిత్స పొందారు. ఈ హెల్త్ క్యాంప్‌లో వైద్యులు డయాబెటిక్ ఫుట్ హెల్త్‌పై అవగాహన, సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ హెల్త్ క్యాంప్ డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో జరిగింది. దివంగత రెబెల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, కూతురు సాయి ప్రసీద ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేశారు.
ఈ హెల్త్ క్యాంప్ లో మన దేశంతో పాటు యూకే, యూఏఈకి చెందిన డయాబెటిక్ ఫుట్ స్పెషలిస్టులు, అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ శ్రీనివాస్ శేషబట్టారు సారథ్యంలోని జుబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్, డాక్టర్ వర్మ నేతృత్వంలోని భీమవరంలోని డాక్టర్ వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్ నరేష్ సారథ్యంలోని భీమవరంలోని ఇంపీరియల్ హాస్పిటల్ ప్రతినిధులు ఈ హెల్త్ క్యాంప్ లో భాగస్వామ్యులు అయ్యారు. ఈ కార్యక్రమం విజయంవంతం అయిన సందర్భంగా ఉప్పలపాటి శ్యామలాదేవి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్యామల ఉప్పలపాటి మాట్లాడుతూ ‘‘రెండో యుకెఐడిఎఫ్ఎఫ్ హెల్త్ క్యాంప్ సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉంది. పెద్ద సంఖ్యలో ప్రజలు మా ఆరోగ్య శిబిరంలో పాల్గొన్నారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ఎంత అవసరమో ప్రజల స్పందన తెలియజేస్తోంది. అందరికీ వైద్యం అందాలని కృష్ణంరాజు గారు కోరుకునేవారు. ఆయన ఆశయానికి ప్రతిరూపమే ఈ వైద్య శిబిరం. ఈ హెల్త్ క్యాంప్ ను మరింతగా ముందుకు తీసుకెళ్తాం’’ అని చెప్పారు.
సాయి ప్రసీద ఉప్పలపాటి మాట్లాడుతూ ‘‘యుకెఐడిఎఫ్ఎఫ్ హెల్త్ క్యాంప్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నం ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురావడం సంతోషంగా ఉంది. మా వైద్య బృందం, ప్రజల సహకారంతో సక్సెస్ ఫుల్ గా క్యాంప్ నిర్వహించాం. డయాబెటిక్ పుట్ కేర్ అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మరిన్ని నిర్వహిస్తామం’’ అన్నారు.