బీజేపీ నేత ప్రకాష్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఎంఐఎం బీటీమ్ అని ఫిరోజ్‌ఖాన్ వ్యాఖ్యలతో తెలిసిపో\యిందని అన్నారు. కాంగ్రెస్ అసలు బండారం బయటపడిందని, తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దే విభజన జరగొచ్చు అని, మత ప్రాతిపదికన దేశం విడిపోవచ్చు అని వ్యాఖ్యానిం చారు. జిన్నా మేనిఫెస్టోను అమలు చేస్తున్నారని గతంలో కిషన్‌రెడ్డి అంటే తప్పుబట్టారని, సెక్యులరిజం అంటే రేవంత్, రాహుల్ అర్దం చెప్పగలరా అని ప్రశ్నించారు. బీజేపీ అంటే పార్టీలకు భయం పట్టుకుందని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. కాంగ్రెస్ ఐదేళ్లు ఉందంటే గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత మంది ఎమ్మెల్యేలు చేరినా కాంగ్రెస్‌కు ఎందుకు భయం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎక్కడ వచ్చినా కరప్షన్, కరువు వస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన ఈవెంట్ మేనేజ్ మెంట్ కమిటీలా ఉందని విమర్శించారు.


