టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇవాళ మరొకరిని అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్‌ను బెంగళూరు క్రైం బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో A2గా ఉన్నాడు అరుణ్‌కుమార్. బర్త్‌డే పార్టీ నిర్వహించిన వాసుకి అరుణ్ అనుచరుడుగా ఉన్నాడు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫామ్‌హౌస్ యజమాని గోపాల్‌రెడ్డికి సీసీబీ నోటీసులు పంపింది. సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మరోవైపు ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ స్టిక్కర్ వాడిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్ నుంచి పరారైన పూర్ణారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. రేవ్ పార్టీ జరిగిన రోజు ఫామ్ హౌస్ బయట కాకాణి పేరుతో స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు గుర్తించారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రాజకీయ దుమారమే రేగింది.