నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దసరా చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. 100 కోట్లు కలెక్ట్ చేసింది. నానిని 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. ఆతర్వాత ఈ క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మరో సినిమా ది ప్యారడైజ్. ఈ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఊర మాస్ అనేలా ఉంది.
ఈ గ్లింప్స్ చూసినట్లైతే.. చరిత్రలో అందరూ చిలకలు పావురాలు గురించి రాసిర్రు గానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్ళి నడిచే శవాల కథ. అమ్మరొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కథ. ఒక దగడ్ వొచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు. థూ.. అనిపించుకున్న కాకులు తల్వార్ లు పట్టినాయ్. ఇది ఒక ల.. కొడుకు కథ అంటూ గ్లింప్స్ లో చూపించారు. ఇందులో నాని లుక్ క్యారెక్టర్.. డైలాగ్స్ చాలా సర్ప్రైజింగ్ గా ఉన్నాయి. అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవల్ అన్నట్టుగా ఉంది. గ్లింప్సే ఇలా ఉంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఇది నిజంగానే వేరే లెవల్లో ఉండే సినిమాని అనిపిస్తోంది.