జనసేనాని నామినేషన్
ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయను న్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. పవన్ నామినేషన్ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగనుంది. అనంతరం పవన్ ప్రత్యేక కాన్వాయ్‌లో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. నామినేషన్ ర్యాలీలో భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది.
ఈ నెల 24న గన్నవరం అభ్యర్థిగా యార్లగడ్డ వెకంట్రావు నామినేషన్
కృష్ణాజిల్లా గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెకంట్రావు కూటమి నేతలతో భేటీ అయ్యారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో తెలుగుదేశం, బిజెపి, జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ నెల 24న నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలతో యార్లగడ్డ చర్చించారు. తొలుత ఈ నెల 25న నామినేషన్ వేయాలని భావించారు. అయితే, ఆదే రోజు వైసీసీ అభ్యర్థిగా కూడా నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ఈ నెల 24 న నామినేషన్ వేయాలని యార్లగడ్డ నిర్ణయించారు.
పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థిగా యరపతినేని నామినేషన్
పల్నాడులో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరచాలని చూస్తే చూస్తూ ఊరుకోరని టీడీపీ నేత యరపతి నేని శ్రీనివాసరావు హెచ్చరించారు. పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థిగా యరపతినేని నామినేషన్ వేశారు. టిడిపి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అలిమి గాని హామీలతో అధికారం లోకి వచ్చిందని అన్నారు. సొమ్ము గురజాలది సోకు నరసరావుపేట లా ఉందని అన్నారు. కాసు మహేష్ రెడ్డి 500 కోట్లతో నరసరావుపేటలో షాపింగ్ మాల్ కడుతున్నారని ఆరోపించారు.


