రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆడబిడ్డలు అభద్రతా భావంలో ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళల పాత్ర కీలకమని చెప్పారామె.
ఇంకా కవిత మాట్లాడుతూ.. ” బీడీ కార్మికులకు కేసీఆర్ పింఛన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక క్రైమ్ రేట్ 20 శాతం పెరిగింది. ఆడబిడ్డలు అభద్రతా భావంలో ఉన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న
పదేళ్లలో ఎక్కడా మత ఘర్షణలు ఎక్కడా జరగలేదు. ఓల్డ్ సీటీలో శివాలయంలో మాంసం ఉందని వార్తలు వచ్చాయి. కేసీఆర్ హయాంలో పెట్టిన సీసీ కెమెరాల్లో 70 శాతం పని చేయడం లేదు. మహిళలు భద్రత కోరుకుంటున్నారు. ఫ్రీబస్సులో మహిళలకు గౌరవం లేదు. బస్సుల సంఖ్యను తగ్గించారు
ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు ప్రతి నెలా కేసీఆర్ వెయ్యి రూపాయలు ఇచ్చారు. మానవత్వం లేకుండా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నారు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ నుండి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి మొహం చూసి ప్రజలు ఓట్లు వేయలేదు.
తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి రూ.35,000 బాకీ పడ్డారు. సోనియాగాంధీ మొహం చూసి ప్రజలు ఓట్లు వేశారు. రాహుల్ గాంధీ వరంగల్ రాకుండా పారిపోయారు. ఇచ్చిన మాట నిలుపుకొకపోతే తెలంగాణలో ఎక్కడా రాహుల్ గాంధీ తిరగలేని పరిస్థితి వస్తుంది. మార్చి 8వ తేదీన మహిళా శంఖారావం ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్నాం. మార్చి 8వ తేదీన అసలు సినిమా చూపెడతాము”.. అని కవిత అన్నారు.