తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో ఎన్‌డీఎస్‌ఏ కమిటీ సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పని చేసిన ఉద్యోగులు, ఇంజనీర్లతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం భేటీ అయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిటీ పరిశీలించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి పలు వివరాలను కమిటీ సేకరించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. తొలిరోజు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల బృందం.. రెండో రోజు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించింది. ఇరిగేషన్ అధికారులతో సమావేశమై ప్రాజెక్టు పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అన్నారం సరస్వతి బ్యారేజీలో ఎక్కడెక్కడ సీపేజ్‌లు ఉన్నాయనే విషయంపై ఆరా తీశారు.


