2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సీఎం మాట్లాడారు. భారత్ అభివృద్ధిని ప్రపంచదేశాలు గమనిస్తున్నాయని సీఎం అన్నారు. ఐటీవల దావోస్ పర్యటనలోనూ దీన్ని గమనించానని చెప్పారు. గతంలో ఐటీపై, ఇప్పుడు ఏఐపై దృష్టి పెరిగిందన్నారు. ఏఐ సాంకేతికతలో భారత్ ముందుందని చెప్పారు. దేశంలో పెట్టుబడులకు చాలా మంది ముందుకొస్తున్నారన్న సీఎం… పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రథమంగా ఏపీలోనే జరిగాయని చెప్పారు. MSME పాలసీ గేమ్‌ఛేంజర్‌గా మారబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.