హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్కు లైన్ క్లియర్ అయింది. కరెంటు కష్టాలు తొలగిపోయాయి. నాలుగైదు గంటల తర్వాత స్టేడియంకు విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. దీంతో నేడు హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ యధాతథంగా జరగనుంది. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా కానీ హెచ్సీఏ పట్టించుకోలేదని… నోటీసులకు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. విద్యుత్ బకాయి బిల్లుల చెల్లింపునకు విద్యుత్ శాఖ ఒక్కరోజు సమయం ఇచ్చింది.


