తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. SIB ఆఫీసులో ఆధారాలు ధ్వంసం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కదలికలపై 24 గంటలు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్‌గా నియమించినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు.. ఎవరెవరిని కలుస్తున్నారో నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్సియల్ సోర్స్ ఎవరు అందిస్తున్నారు? .. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికలపై కూడా నిఘా పెట్టారు. ఇదంతా సమాచారాన్ని సేకరించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మారడంతో ఆయనపై కూడా 24 గంటలు నిఘా పెట్టినట్టు దర్యాప్తులో తేలింది.
మరోవైపు నిందితులు ఇచ్చిన సమాచారంతో విచారణ కొనసాగిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకు లకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచి దర్యాప్తు బృందం వారిని విచారించనుంది. ఐపీడీఆర్ తో డేటా రీట్రీవ్ చేసే యోచనలో ఉన్నారు. స్నాప్ చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు పై వరుసగా బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను పరిశీలించి, సాక్షులను విచారించనున్నారు పోలీసులు.