24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
spot_img

బీజేడీ కంచు కోటలో బీజేపీ సీట్లు గెలిచేనా?

   ఒడిశా అంటేనే.. తిరుగులేని నాయకుడు నవీన్ పట్నాయక్ గుర్తుకు వస్తారు. లోక్ సభ ఎన్నికలైనా.. అసెంబ్లీ ఎన్నికలైనా.. బస్తీమే సవాల్ విజయం నవీన్ పట్నాయక్ దే. 2024 పార్లమెంటు ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరుగుతున్న నాలుగైదు రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి.. ఈ సారి అసెంబ్లీకి , పార్లమెంటుకు నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతాదళ్, బీజేపీకి డైరెక్ట్ ఫైట్ తప్పేటట్లు లేదు. కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు రంగంలో ఉన్నాయి..

2000 సంవత్సరం మార్చి నుంచి ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బీజేడీ ప్రభుత్వమే నడు స్తోంది. దేశంలో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న వ్యక్తి నవీన్ పట్నాయకే. ఆయన జ్యోతి బసు 23 ఏళ్ల సీఎం రికార్డును కూడా అధిగమించేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ -మార్క్సిస్ట్ వంటి పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అధికారం బీజేడీ దే. పార్లమెంటు ఎన్నికల్లోనూ గత మూడు, నాలుగు టర్మ్ ల నుంచీ బీజేపీ పెద్దగా రాణించలేదు. 2014లో దేశం అంతా మోదీ ప్రభంజనం వీచినా.. ఒడిశాలో మాత్రం నవీన్ పట్నాయక్ కు ఎదురులేదు. బీజేడీ 21 స్థానాలకు 20 నియోజకవర్గాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఈ సారి అయినా, అసెంబ్లీ ఎన్నికల్లోనూ, లోక్ సభ ఎన్నికల్లోనూ కాషాయం జెండా రెపరెపలు చూడాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రధాని నరేంద్రమోదీ ఇష్టాగోష్ఠి అనంతరం.. రెండు పార్టీల మధ్య 2024 ఎన్నికల్లో పొత్తు ఉంటుందనే ప్రచారం జరిగినా.. సీట్ల సర్దుబాటు విషయంలో అంగీకారం కుదరకపోవ డంతో అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడి గానే పోటీ చేస్తున్నాయి.

నవీన్ పట్నాయక్ శకం మొదలైన తర్వాత.. ఒడిశాలో బీజేపీ పెద్దగా విజయాలు సాధించ లేకపోయింది. 2009 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 21 స్థానాల్లో బీజేడీ 14, కాంగ్రెస్ 6, సిపీఐ 1 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ ఖాతా తెరవలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ 20 బీజేపీ 1 స్థానాలను గెలుచుకున్నాయి. 2019 లో బీజేడీ 12, , కాంగ్రెస్ 1 బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది. సీపీఐకి ఒక్క సీటుకూడా దక్కలేదు. ఒడిశా లో 2014 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో మే 13, మే 20, మే25, జూన్ 1 తేదీల్లో జరుగుతాయి. ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 21 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 2019లో ఒడిశా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేడీ 114 స్థానాలు, బీజేపీ 22 , కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్, బీజేపీ మొత్తం 147 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపీఐ – మార్క్సిస్ట్, సీపీఐ, ఆమ్ ఆద్మీపార్టీలు కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒడిశాలో జయనారాయణ్ మిశ్రా ఆధ్వర్యంలో బీజేపీ, శరత్ పట్టనాయక్ నాయకత్వంలో కాంగ్రెస్ అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

1999లో జార్ఖండ్ లో బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్ కు విధించిన శిక్షపై ఢిల్లీ హైకోర్టు సోమవారం స్టే విధించింది. శిక్షను నిలిపివేయాలని కోరుతూ రే చేసిన దరఖాస్తును కోర్టు అనుమతించింది. ఈ కేసులో 2020 అక్టోబర్ 26న దిలీప్ రాయ్ కు మూడేళ్ల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. 2020 అక్టోబర్ 27న రాయ్ అప్పీలు పై హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసి, అప్పీల్ పెండింగ్ లో ఉన్న సమయంలో జైలు శిక్షను సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు నిర్ణయంతో 2024 ఎన్నికల్లో పోటీ చేసే వీలు చిక్కింది దిలీప్ రాయ్ కు. ఎన్నికల వేళ రాజకీయనాయకుల మ్యూజికల్ చైర్స్ ఆట ఏ రాష్ట్రమైనా మామూలే. ఏళ్లుగా కాంగ్రెస్ కు గెలుపురాత లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు అధికార బిజేడీ వైపు పోతున్నారు. మూడు సార్లు తితల్ గడ్ ఎమ్మెల్యేగా ఉన్న సురేంద్ర సింగ్ భోయ్ తాజాగా కాంగ్రెస్ ను విడిచి బిజేడీలో చేరారు. బాలంగీర్ ఎంపీ స్థానం నుంచి లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అధిరాజ్ పాణిగ్రాహి కూడా నవీన్ పట్నాయక్ పార్టీకే జై కొడుతున్నారు మరికొందరు ఎమ్మెల్యేలు అశుతోష్ మొహంతి, నరేన్ పిళ్లై, నిహార్ మహానంద్ కాంగ్రెస్ నేత బాపి సర్కేల్ భార్య మొనిదీప, ఇతరులు అటు బీజేడీ లోనో, ఇటు బీజేపీలోనో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

మోదీ ప్రభంజనాన్ని నమ్ముకున్న ఒడిశా బీజేపీ మాత్రం ఉత్సాహంగానే లోక్ సభ ఎన్నికల వైపు పావులు కదుపుతోంది. ఆరు సార్లు కటక్ ఎంపీగా ఉన్న భత్తృహరి మహతాబ్ బీజేడీ కు రాజీనామా చేసి ఈ మధ్య బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ టికెట్ పై కటక్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. 13 ఏళ్లక్రితం 2011లో ఓ పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ పై దాడి చేసిన కేసులో ఒడిశా స్పెషల్ కోర్టులో భత్తృహరి మెహతాబ్ పై చార్జిషీటు దాఖలు చేయడంతో ఆయన పార్టీ మారారు. గిరిజనులు ఎక్కువగా ఉండే మయూర్ భంజ్ లోని బరిపడ పార్లమెంటు నుంచి ప్రసిద్ధ రచయిత బేషరాను బీజేపీ అభ్యర్థిగా నిలిపే ఆలోచన సాగు తోంది. లోక్ సభలో బీజేపీకి 370 స్థానాలు, ఎన్డీయేకు 400 స్థానాల్లో విజయం తెచ్చి పెట్టాలని ప్రధాని మోదీ దేశవ్యాప్తం గా సుడిగాలి పర్యటనలు, ర్యాలీలు చేస్తున్నారు. అది సాధించాలంటే.. ఒడిశాలో బీజేపీ పెద్దఎత్తున సీట్లు గెలవాల్సిందే. నవీన్ పట్నాయక్ రాజ్యంలో ఇది సాధ్యమా.. చూడాలి.

Latest Articles

‘పద్మవ్యూహంలో చక్రధారి’ ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్