తెలంగాణలో జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ రగడ కొనసాగుతోంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు మోకిల పోలీసులు. డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని చెబుతున్న విజయ్ మద్దూరిని ఇవాళ మరోసారి పోలీసులు విచారించనున్నారు. తాను చెప్పని విషయాలను FIRలో రాశారంటూ విజయ్ మద్దూరి ఆరోపిస్తున్నారు. పార్టీలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగలేదని అంటున్నారు. కావాలనే తమను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని విజయ్ మద్దూరి ఆరోపించారు.


