ఆదిలాబాద్‌లో పత్తి విత్తనాల కోసం చేస్తున్న రైతుల ఆందోళనలకు ప్రభుత్వం స్పందించింది. డిమాండ్ ఉన్న రాశి 659 విత్తనాలను రైతులకు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. తమిళనాడు నుంచి 80వేల రాశి ప్యాకెట్లను ప్రభు త్వం దిగుమతి చేయనుంది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు మండలాల్లోనూ పంపిణీకి వ్యవసాయ శాఖ సిద్ధమైంది. విత్తనాల పంపిణీని మండలాల్లో వ్యవసాయ అధికారులు పర్యవే క్షించనున్నారు. రైతులు ఆందోళన చెందవద్దు అని భరోసా ఇచ్చారు జిల్లా అధికారులు. మరికొన్ని రోజుల్లో నే అందరికీ విత్తనాలు అందిస్తామని వ్యవసాయ శాఖ అధికా రులు చెప్పారు.


