26.4 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

ఆ విషయంలో సినీ ఇండస్ట్రీ భయపడుతోంది- పవన్

స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబు అరెస్టుపై స్పందించడానికి సినీ ఇండస్ట్రీ భయపడుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో మాట్లాడుతూ… ‘ఇండస్ట్రీలోని వారు పొలిటికల్ హీట్ ను తీసుకోలేరు. చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే స్పందించడానికి భయపడుతున్నారు. ఎవరైనా మాట్లాడితే వైసిపి నేతలు టార్గెట్ చేస్తారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతి రేకంగా సినిమాలు తీసిన కక్ష సాధింపు జరగలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు’ అని పేర్కొన్నారు. అంతే కాక, నాలుగో విడత వారాహి యాత్ర సక్సెస్ అయినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో సమస్యలు తనకెంతో బాధ కలిగించినట్లు పవన్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంటూరు మార్పు అంశం తీవ్రంగా బాధించిందన్నారు. అలాగే బందరులో జరిగిన జనవాణి కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్