స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలు లోకల్ నాన్లోకల్ మధ్య పోటీ అంటూ రాష్ట్ర మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నర ఏళ్లలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక్క పండుగ కూడా ఏపీలో జరుపుకోవాలని వెల్లడించారు మంత్రి అమర్నాథ్. మొదటిసారి దసరా పండుగను చంద్రబాబు నాయుడు జైలులో గడిపే అవకాశం వచ్చిందని.. ఇలాగే నాలుగు, ఐదు పండుగలు చేసుకోబోతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నాడనే బాధ టిడిపి కార్యకర్తలు తప్ప కుటుంబ సభ్యుల్లో మాత్రం కనిపించడం లేదన్నారు. బాలకృష్ణ సినిమాలు డ్యాన్స్ తో ఖుషి గా ఉండడమే అందుకు నిదర్శనం అన్నారు. లోకేష్ ఢిల్లీ టూరు బ్రాహ్మణి భువనేశ్వరి బిజినెస్ పనుల్లో బాలకృష్ణ సినిమాల్లో బిజీబిజీగా ఉన్నారని పేర్కొన్నారు. దొంగ అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఎవరు ఎన్ని యాత్రలు చేసినా ఏపీ ప్రజలు విశ్వసించారు అని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రకు బ్రేక్ వచ్చిందని లోకేష్ సంతోషిస్తున్నాడని తెలిపారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాన్ రెసిడెన్సు ఆంధ్రులంటూ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. వయసు మీద పడిన తర్వాత తప్పులు చేయకూడదని ఇంగిత జ్ఞానం చంద్రబాబు కుండాలని.. ఆయన ఎంతకాలం జైలులో ఉండాలనేది న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్నారు.