Free Porn
xbporn
22.7 C
Hyderabad
Monday, October 28, 2024
spot_img

సుప్రీం కు చేరిన పార్టీ ఫిరాయింపుల వివాదం

తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మూలిగే నక్క మీద తాటి పండుపడినట్లుగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతి ని,  దిద్దుబాటు చర్యలు చేపట్టినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసింది. లోక్ సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. దీంతో పార్టీ పరిస్థితి పాతాళానికి పడిపో యింది. ఉద్యమ పార్టీగా ప్రజల మన్నలను పొంది పదేళ్లు తిరుగులేని శక్తిగా ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ఓటమి గల కారణాలపై విశ్లేషించుకునే పనిలో ఉండగా పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారాయి.

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దినదిన గండంగా మారింది. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతు న్నారు. అధైర్యపడొద్దు మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయని అధిష్టానం ధైర్యం చెప్పినా కూడా రోజుకో ఎమ్మెల్యే జంప్ అవుతున్నాడు. దీంతో బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకమైంది. గత పదేళ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఛరిస్మా, కారు గుర్తతోనే చాలా మంది ముక్కు మొహం తెలియని అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. దాదాపుగా ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలనే యోచనలో ఉంది. కానీ ఆనాడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ నేతలు పార్టీ ఫిరాయింపులను తప్పబడితే బీఆర్ఎస్ పట్టించుకోలేదు. తమ సంక్షేమం, అభివృద్ధి పనులు నచ్చే పార్టీలో చేరుతున్నారంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. కారెక్కిన నేతలు ఒక్కొక్కరిగా హస్తం గూటికి చేరుతున్నారు. రోజుకో నేత కాంగ్రెస్ కండువా కప్పు కుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత ఎంత ధైర్యం చెప్పినా కూడా వలసలు ఆగడం లేదు. ప్రజా ప్రతినిధులే కాకుండా జిల్లా స్థాయి నేతలు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. దాదాపు కారు ఖాళీ అయినట్లే కనిపిస్తుంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండి పడుతుంటే మరోవైపు కాంగ్రస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మీరు చేసిందే కదా మేము చేస్తుంది అంటున్నారు. అప్పుడు మీరు చేస్తే తప్పు కానిది.. ఇప్పుడు మేం చేస్తే ఎలా తప్పవుతుంది అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన జగి త్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం రాత్రి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కాంగ్రెస్‌ కండువా కప్పుకు న్నారు. సీఎం రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఈ చేరికతో మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్టయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. అంతకంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయానికి వస్తే 2018లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు.

   జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. బీఆర్ఎస్ కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరారు. తనకు సమచారం లేకుండా సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర మనస్థాపం చెందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నారు. ఈ విషయంపై తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు జీవన్ రెడ్డిని బుజ్జగించేం దుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవ ద్దని కోరినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ను కలిశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో దానం పై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లడం సమంజసం కాదన్నారు. రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్లని రాళ్లతో కొట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పార్టీ ఫిరాయింపులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయిం పులను ప్రోత్సహించిందే కేసీఆర్ అని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీల ను కూడా లాక్కుందన్నారు. ఆనాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమంటే పట్టించు కోని వాళ్లు నేడు ఎందుకు గగ్గోలు పెడుతున్నారన్నారు. మీరు చేస్తే న్యాయం మేం చేస్తే అన్యాయమా అంటూ ప్రశ్నించారు. శాసన సభలో భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది మీరు కాదా అంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. శాసన మండలిలో తనకు ప్రతిపక్ష నేత హోదా తొలగించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది బీఆర్ఎస్. దానం నాగేందర్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు కోర్టు మెట్లెక్కనున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధిష్టానం న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతుంది. దీంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది.

Latest Articles

హీరో అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్ట్‌లో ఊరట

హీరో అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్ట్‌లో ఊరట లభించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసులో తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. నవంబర్‌ ఆరున నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. ఏపీ ఎన్నికల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్