స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కూతురు చొరవచూపి ధైర్యం, సాహసం ప్రదర్శించడంతో ఓ తండ్రి ప్రాణాలు నిలబడ్డాయి. కర్రతో తన కూతురు పులిని తరమడంతో రైతు ప్రాణాలు దక్కాయి. ఉత్తర్ప్రదేశ్ పీలీభీత్ జిల్లాలోని సంతోష్‌పురా గ్రామానికి చెందిన డోరీలాల్ (40) అనే రైతు.. తన కూతురితో పొలానికి వెళ్ళాడు. పొలంలో పనిచేస్తున్న డోరీలాల్ పై అటుగా వస్తున్న చిరుత పులి చూసి అతనిపై దాడి చేసింది. ఇది గమనించిన కూతురు ఎలాంటి భయం లేకుండా కర్ర పట్టుకోని పులిని బెదిరించింది. దీంతో పులి అక్కడినుండి పారిపోయింది. పులి దాడిలో గాయాలైన తన తండ్రిని వెంటనే ఆస్పత్రికి స్థానికులు తరలించారు. చిన్నపాటి గాయాలు కావడంతో డోరీలాల్ ప్రాణాలు దక్కాయి.
అనంతరం చిరుత సంచారంపై అటవీ సిబ్బందికి సమాచారం అందించగా.. దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు సంతోష్‌పురా గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించి చిరుత దాడిలో గాయాలపాలయ్యాడు. అనంతరం పులి అక్కడినుడి పారిపోయింది. ఏదేమైనా చిరుతను పట్టుకునే తీరుతామని అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు.