నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంటను కాపాడిన ఓ మత్స్యకారుడు ఆపై ప్రియుడి చెంప పగలగొ ట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్వాలి నగరంలోని గోలాఘాట్ వద్ద గోమతి నదిలో కి ఓ జంట దూకడం చూసిన అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఓ మత్స్య కారుడు నదిలోకి దూకి వారిని రక్షించి బయటకు తీసుకొచ్చాడు. ఆ వెంటనే అతడు ప్రేమికుడి చెంప పగలగొట్టాడు. ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. యువతి కొంత అస్వస్థతకు గురైంది. అయితే, వారి ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.