ములుగు జిల్లా ముకునూరుపాలెం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో తాగునీటి సమస్యతో అల్లాడుతు న్నామని.. వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం- వెంకటాపురం రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించా లని కోరుతూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లకు నీరు రాక నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మన్నారు. నీటి కోసం కూలి పనులు మానుకొని ఇంటి వద్ద ఉండి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి తమను ఆదుకోవాలని కోరారు.


