మేడ్చల్ వరకు మెట్రో రైలును పొడిగించాలంటూ మెట్రో సాధన సమితి ఆందోళన చేపట్టింది. మేడ్చల్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపింది. మెట్రో ఫేస్ 2 విస్తరణలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో రైలును ప్రకటిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్ర హానికి వినతి పత్రం అందజేసారు. మేడ్చల్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఫేస్ 2 మెట్రో విస్తరణలో బాగా మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ మంజూరు చేయాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు కోరారు. మేడ్చల్ నుండి హైటెక్ సిటీ, గచ్చిబౌలి హైదరాబాదులోని ఇతర ప్రాంతాలలో ఉద్యో గాలు చేసే ప్రయాణికులకు ప్రయాణం వెసులుబాటు ఉంటుందని చెప్పారు.
.
మేడ్చల్ వరకు మెట్రో రైలును పొడిగించాలంటూ ఆందోళన
Latest Articles
- Advertisement -