నిత్యం రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ హల్‌చల్ చేశాయి. సెంట్రల్ లండన్ సమీపంలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది తమ గుర్రాలకు శిక్షణనిస్తున్నారు. ఆ సమయం లో గుర్రాలు ఒక్కసారిగా వారిని తోసుకుంటూ వీధుల్లో పరుగెత్తడం ప్రారంభించాయి. వాటి దాడిలో ఒక సైనికుడికి గాయాలయ్యాయి. అనంతరం రెండు గుర్రాలు రద్దీగా ఉన్న రోడ్లపై హల్‌చల్ చేయడంతో పాదచారులు, పలువురు వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో కొందరు భయభ్రాంతు లకు గురికాగా మరికొందరు ఈ దృశ్యాలను వీడియోల్లో బంధించారు. ఈ వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. చివరికి లండన్‌లోని లైమ్‌హౌస్ సమీపం లోని హైవేపై రెండు గుర్రాలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాటిలో ఒకటి బస్సును ఢీకొని గాయాలపాలైందని, మరో గుర్రం కాళ్లకు గాయాలు ఉండడంతో వెటర్నరీ కేర్‌కు తరలించామని చెప్పారు. లండన్‌లోని అధికారిక భవనాల చుట్టూ ఆర్మీ సిబ్బంది గుర్రాలపై తిరుగుతూ పహారా కాస్తుంటారు. దీనికోసం వాటికి ప్రత్యేక శిక్షణ సైతం కల్పిస్తారు.


