పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. దానికి నిరసనగా జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ప్రేమ, చిత్తశుద్ధి లేదన్నారు. అన్ని రాష్ట్రాల కలియకతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పటయిందని.. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా అనేక నిధులు కేటాయించారని తెలిపారు… తెలంగాణకు మాత్రం అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పన్నులు కడుతుంటే.. రాష్ట్రానికి మోడీ సర్కార్ మాత్రం మొండి చేయి చూపిస్తుందని కడియం శ్రీహరి అన్నారు.